Tuesday, 8 November 2011
1 శ్రీనివాసుని మదిని తలచి
ఖాదరు ఖాన్ గురుని తలచి
చెప్పెదను ముత్యాల సరములు
సాయపడు వాణీ
![]() |
| గురజాడ అప్పారావు గారు |
2 గురుడు శ్రీ గురజాడ అప్పా
రావు చెప్పిన త్రోవ త్రొక్కి
గిడుగు రామ మూర్తి అడుగుల
లోన నడిచెదను
3 సంసార సాగరమందు నేను
మునిగి మునిగి వెతుకు తున్నా
చేతికందిన ముత్యములను
నీ చేతికందిస్తా
3 సంసార సాగరమందు నేను
మునిగి మునిగి వెతుకు తున్నా
చేతికందిన ముత్యములను
నీ చేతికందిస్తా
4 మెత్తని హృదయాలు కలిగిన
ఉత్తమ కవులకు చేతు
లెత్తి మ్రోక్కుతాను , తలవను
చెత్త కవులను
5 ప్రేమకోసం పాడుకోవోయ్
ప్రేమ కోసం ఆడుకోవోయ్
ప్రేమ జీవనములోనే
ప్రాణ మున్నదోయి
6 ప్రేమలో ఆనందముందోయ్
సుఖము లేకపోతే నేమోయ్
ఆనందమంటే సుఖం కాదని
అర్ధముందోయీ?
7 కొట్టవద్దోయ్ తిట్టవద్దోయ్
పని పట్టి చంప వద్దోయ్
ప్రేమతో నే ప్రజలనందరి
పరిపాలించు
8 పీకి పారేసాను కానీ
ప్రాకు తున్నది బీర తీగ
ప్రక్కనుండి ఎవరు దీన్ని
ప్రోత్స హించారు
9 పూసే పూసే మొగ్గ లోపలి
పుప్పోడె త్తుకు పోయె గాలి
కాసి, కాయలు .పండలేనని
కంట నీరేది ?
10 కోసి వేస్తున్నారు కానీ
పూస్తూనే ఉన్నాది మల్లె
ఎందుకోసం దీనికింత
వెర్రి ఆనందం ?
11 ఎందుకో ఈ పూవులన్నీ
నన్ను చూచి నవ్వుతున్నై
ముందు సంగతి చింతనీకు
ఎందు కంటయ్యీ .
నన్ను చూచి నవ్వుతున్నై
ముందు సంగతి చింతనీకు
ఎందు కంటయ్యీ .
12 పండుటాకు మాదిరెపుడో
ఎండి వాడి రాలి పోతావు
ఉండ బోని దాని కెందుకు
ఉబలాటము
13 పాపమేంటో కొంత మందికి
చూపటానికి దేముడిటు, కు
రూపి ,కుష్టు ,గ్రుడ్డి వారల
రూపు దాల్చాడు
14 ముళ్ళ పొదలో పూలగుత్తులు
పిల్లమెడలో నల్ల పూసలు
తల్లి వొడిలో పియ్యి ఉచ్చలు
ప్రేమ బంధాలు.
పిల్లమెడలో నల్ల పూసలు
తల్లి వొడిలో పియ్యి ఉచ్చలు
ప్రేమ బంధాలు.
15 గున్నమామిడి పళ్ళ గుత్తులు
వెలుగునిచ్చే లైటు వత్తులు
దేశ రక్షణ చేయు కత్తులు
త్యాగ చిహ్నములు
వెలుగునిచ్చే లైటు వత్తులు
దేశ రక్షణ చేయు కత్తులు
త్యాగ చిహ్నములు
16 మేల్గులాబి పూల గుత్తులు
తీపి మొక్క జొన్న పొత్త్తులు
కమ్మనైన గుమ్మడిత్తులు
తీపి మొక్క జొన్న పొత్త్తులు
కమ్మనైన గుమ్మడిత్తులు
సృష్టి సంపదలు
17 పూవు పూవు మీద తుమ్మెద
వ్రాలి మధువు గ్రోలుతున్నది
మనుషులకు ఈ కలిమి లేములు
మనం పెట్టినవే .
వ్రాలి మధువు గ్రోలుతున్నది
మనుషులకు ఈ కలిమి లేములు
మనం పెట్టినవే .
18 మంచి మంచి కాయలన్నీ
ఎంచి ఏరుతారు వీరు
చేదు వన్నీ ఎవరి కోసం
చేయబడ్డాయో ?
ఎంచి ఏరుతారు వీరు
చేదు వన్నీ ఎవరి కోసం
చేయబడ్డాయో ?
19 పిచ్చి పిచ్చి మొక్కలన్నీ
పీకేయడా తోట మాలి
పనికిరాని మనుషు లంతే
పీకేయడా తోట మాలి
పనికిరాని మనుషు లంతే
ప్రపంచంలోను
20 చెట్టు మీద పిట్టలన్ని
చెంగు చెంగున ఎగురుతున్నై
ఇళ్లు వాకిళ్ళు లేవని
విచారం లేదేం ?
చెంగు చెంగున ఎగురుతున్నై
ఇళ్లు వాకిళ్ళు లేవని
విచారం లేదేం ?
21 పచ్చ పువ్వుల రంగు దుప్పటి
కప్పుకుంది ఒలిశ రాణి
నిక్కి నిక్కే కంది మొక్కల
వెక్కిరించింది
కప్పుకుంది ఒలిశ రాణి
నిక్కి నిక్కే కంది మొక్కల
వెక్కిరించింది
22 పచ్చ పచ్చని పూల టోపీ
పెట్టుకుంది కంది చేను
ఒలిశ రాణి ఒళ్ళు, పగల
గొట్టి వేసారు
23 ఎవరు పలికిస్తారో నిన్ను
ఎవరు కులికిస్తారో నిన్ను
ఎవరు చిలికిస్తారో పువ్వులు
ఎరుగ వలేనోయి -
24 చెట్ల ఆకులు పండిపోటం
పూల రేకులు రాలి పోటం
మనుషులకు ఇది మంచి పాఠం
మరిచిపోకోయీ
25 తూర్పు కొండల మీది నుండి
వెలుగు కనిపిస్తోంది నాకు
లెండి లెండి మేలుకోండి
లేచిపోదాము
.
26 కష్టమూ సుఖముకు నీవు
ఖాతరు చేయక పొతే
దేముడున్నాడంటూ మది లో
తలచ పని లేదోయ్ !
27 గురు కటాక్షం కలిగేతేనే
పరమపద మర చేతిలోనిది
గురుని పాదం పట్టి నీవు
మొరలు పెట్టా లోయ్ !
28 పాపమేంటో పుణ్య మేంటో
నాకు తోచ కున్నదిచ్చట
పాప పుణ్యం లేని ఉన్నత
స్థాన మిప్పించు !
29 క్రొత్త సంవత్సరం మరువకు
ఎత్తుగా ఉండాలె ఆశలు
చిత్తము గురు పాదములకు
ఒత్తి ఉంచాలోయ్ !
30 అపజయం కలగొచ్చు , హృదయం
తడబడీ బెదరొచ్చు ,లోకులు
పక పకా నవ్వొచ్చు , మానకు
దైవ ప్రార్ధనను
31 బ్రతక లేమని భయం వద్దోయ్
సతమతంబై చావ వద్దోయ్
నిరతమూ గురు స్మరణ చేస్తూ
తరించాలోయీ
32 క్రొత్త సంవత్సరము , చిత్తము
విత్త మార్జన మందె నిలుపకు
భక్తీ తో గురు సేవ చేసి
ముక్తి నార్జించు
33 హిందువులు మహమ్మదీయులు
అందరూనూ వ్కోక్కటేను
అన్నదమ్ముల మాదిరి చ్చట
మన్నుతుండాలె
34 మారుతున్నై కాలరీతులు
జారుతున్నై సంఘనీతులు
మారిపోయిన దారి నడిచే
మనిషి ఉత్తముడోయ్.
35 ఎత్తు ఎత్తుమే డలున్నా
36 లోకమంతా ఒక్క నీతే
37 మనుషులంతా మంచి వారై
38 దేముడిచ్చే సంపదలకై
39 మానవత్వం మరువకండోయ్ !
జ్ఞ్యానసూత్రం విడువకండోయ్
అందరూ హాయిగా ఉండే
మందు వెతకండోయ్ .
40 మంచిమనసే మానవత్వం
పరులసేవే ప్రేమతత్వం
జ్ఞ్యాన కాంక్షే ఉన్నతత్వం
మరచి పోకోయీ!
41 ఒక్కటైనా మంచిపని ,నే
నక్కటా చేసాను కాను
కాలమంతా పొట్ట కొరకే
గడచి పోతోంది.
42 ఓయి మనిషీ! అందరూ యిట
హాయిగా బ్రతకాల, పరులకు
హానిచేసే తలపులన్నీ
మానివేయాలోయ్ !
43 మంచిపనులే మనిషి నిచ్చట
మరువకుండా మనని చేస్తై
ఇళ్ళు వాకిళ్ళన్ని సంపద
లిట్టె పోతయ్యి
44 విత్తమే ముఖ్యమనుకుంటే
చిత్తము నిలిచేది సున్న
ఉత్తముడవై లోకమందున
ఉన్నతీ సున్నా!
45 కాల చక్రం తిరుగుతున్నది
మూల సూత్రం మారుతున్నది
మార్పు ననుసరించు వాడే
నేర్పుగల మనిషోయ్ !
46 మారుతున్నై కాలరీతులు
జారుతున్నై సంఘ నీతులు
మారిపోయిన దారి నడచే
మనిషి ఉత్తముడోయ్
47 కలిమి హృదయం క్రుంగ జేయును
లేమి హృదయం లేవదీయును
కలిమి కలిగి లేమి నెరిగి
మెలగ వలెనోయీ
48 మనిషి మనిషి పందెమేసుకు
నడుస్తారీ సంఘమందున
సమానంగా చేయటానికి
సాధ్యమవుతుందా ?
49 ఎంత ఉన్నా చింత తప్పదు
లేకున్నా చింత తప్పదు
కలిమిలేములు కావు చింతకు
కోరికలు మూలం .
50 తరతరాలై వచ్చుచున్న
సాంప్రదాయం వదలకుంది
ముందు అడుగువేయటానికి
ఎందుకో భయము .
51 ధనం లోనే బలం ఉందా?
ధనం లోనే కులం ఉందా?
ధనం కోసం ప్రాణ మెందుకు
ధార పోస్తారు ?
52 ఎవ్వరైనా ఎక్కడున్నా
ఎదుర్కొని తీరాలనోయి
వొద్దు వొద్దని యుద్ధ మొద్దని
బుద్ధి చెప్పాలోయ్.
53 పనికిరాని భూములన్నీ
పంటచేలై పండుతున్నై
నీతి తప్పిన మనుషులందరు
ఖ్యాతిగంటున్నార్.
54 తిండి లోను ఏమి లేదు
ఉండే చోటులోను లేదు
తలపులోనే మర్మమంతా
దాగి ఉందోయీ.
55 కామరూపులుగాను స్త్రీలు
కంటి కగపడతారు నీకు
దేముడున్న కోవెలనుకొని
తలచలేవేమి?
56 వొద్దు బాబు అధిక సంపద
వొద్దు బాబు ఆయు వెక్కువ
మితం లేని మెత్త హృదయం
మాత్రమే చాలు
57 పొన్న పండు లాగ కొందరు
పైకి కనిపిస్తారు కాని
ఎన్నో విధముల లోలోపున
కుళ్ళు తుంటారు
58 పైకి దీనులట్లు ఉంటార్
పాపమంటూ అందరంటార్
తృప్తులై ఆనందమున మరి
కొందరుంటారు.
59 పెండ్లి లేక ఆడపిల్లలు
కుళ్ళుతున్నార్ మేడలోన
కట్న మివ్వలేక తండ్రి
గాబరా పడతాడ్.
60 చదువుకున్న ఆడపిల్లలు
జంకు విడిచి బయటికొస్తే
కట్న మడిగే పెళ్లి కొడుకులు
కాళ్ళుపడతారు .
61 చదువుకున్న ఆడపిల్లలు
చంగు చంగున ఎగురుతారోయ్
చాడువులోని సారమెరిగి
చప్పబదతారోయ్
62 పెళ్లి కోసం ఎందుకిల్లా
వొళ్ళు ఇల్లు గుల్ల లవడం
ముందుగానే దేముడంతా
చేసిపంపాడోయ్!
63 వెర్రి భాయి ల్లార మీరు
వేలు వేలు ఖర్చు పెడతార్
రిజిస్ట్రేషన్ పెళ్లి చేసుకు
సుఖం గనలేరేం ?
64 ముప్ఫై ఏళ్ల పెళ్లి కూతురు
నలభై ఏళ్ల పెళ్లి కొడుకు
పెళ్లి పీటల మీద కూర్చొని
మురిసిపోతున్నార్
65 బి. ఎ . చదివిన పెండ్లి కూతురు
ఎల్.ఎల్.బి. పెండ్లి కొడుకు
స్పెషల్ మేరేజి ఏక్ట్ వీళ్ళకు
జ్ఞాపకం రాదా ?
66 ప్రపంచం లో మనుషులంతా
ప్రేమ పంథా పట్టవలెనోయ్
విశ్వకవి టాగూరు పాడిన
పాటలినవోయీ
67 జ్ఞాన నేత్రం మూసుకున్నది
మానవత్వం మూతపడినది
ఎందుకోసం ఓ కవీ! నీ
వెదురు చూస్తున్నావ్ !
68 ఎవరు రమ్మన్నారో దీన్ని
ఎవరు పొమ్మన్నారొ దీన్ని
కష్టమెపుడూ మనిషి నొచ్చి
కదుపుతుంటుంది .
69 చేసేదేమీ లేదు మనకు
ఊసుపోని తలపు నీకు
మాసిపోని మచ్చ నాక ని
మనసులో వద్దు
70 ధనం ఉంటే ఘనం గా పని
తనం చూపెట్టు తూ ఉంటార్
ధనం లేని వాని బ్రతుకు ?
ద్వంసమేనా ?ఏం?
71 ధనం దాచి ఘనత గాంచుట
దొరలు నేర్పిన జ్ఞాన బోధ
నీతి నియమాల్ , సత్య , ధర్మాల్
మరచి పోయారోయ్
72 మంచి పనులే మనిషి నిచ్చట
మరువకుండా,మనని చేస్తై
ఇళ్ళు వాకిళ్ళన్ని సంపద
లిట్టె పోతయ్యి -
73 నీదు సుఖమే నీవు చూచుకు
ఇరుగు పొరుగుల నణగ ద్రొక్కకు
సంఘమంతా సుఖం గుంటే
చాల బాగుండు -
74 వినోభాజీ వచ్చి నాడోయ్
దాన ధర్మం చెయ్యమంటూ
అవసరం లేనట్టి సంపద
లందరి వ్వాలోయ్
ఏరి ఈ ముత్యాల సరములు
కోరి నీ కర్పించు చుంటిని
ప్రేమతో నీ వందుకో
నా పాటల రాణి !
.
పెట్టుకుంది కంది చేను
ఒలిశ రాణి ఒళ్ళు, పగల
గొట్టి వేసారు
23 ఎవరు పలికిస్తారో నిన్ను
ఎవరు కులికిస్తారో నిన్ను
ఎవరు చిలికిస్తారో పువ్వులు
ఎరుగ వలేనోయి -
24 చెట్ల ఆకులు పండిపోటం
పూల రేకులు రాలి పోటం
మనుషులకు ఇది మంచి పాఠం
మరిచిపోకోయీ
25 తూర్పు కొండల మీది నుండి
వెలుగు కనిపిస్తోంది నాకు
లెండి లెండి మేలుకోండి
లేచిపోదాము
.
26 కష్టమూ సుఖముకు నీవు
ఖాతరు చేయక పొతే
దేముడున్నాడంటూ మది లో
తలచ పని లేదోయ్ !
27 గురు కటాక్షం కలిగేతేనే
పరమపద మర చేతిలోనిది
గురుని పాదం పట్టి నీవు
మొరలు పెట్టా లోయ్ !
28 పాపమేంటో పుణ్య మేంటో
నాకు తోచ కున్నదిచ్చట
పాప పుణ్యం లేని ఉన్నత
స్థాన మిప్పించు !
29 క్రొత్త సంవత్సరం మరువకు
ఎత్తుగా ఉండాలె ఆశలు
చిత్తము గురు పాదములకు
ఒత్తి ఉంచాలోయ్ !
30 అపజయం కలగొచ్చు , హృదయం
తడబడీ బెదరొచ్చు ,లోకులు
పక పకా నవ్వొచ్చు , మానకు
దైవ ప్రార్ధనను
31 బ్రతక లేమని భయం వద్దోయ్
సతమతంబై చావ వద్దోయ్
నిరతమూ గురు స్మరణ చేస్తూ
తరించాలోయీ
32 క్రొత్త సంవత్సరము , చిత్తము
విత్త మార్జన మందె నిలుపకు
భక్తీ తో గురు సేవ చేసి
ముక్తి నార్జించు
33 హిందువులు మహమ్మదీయులు
అందరూనూ వ్కోక్కటేను
అన్నదమ్ముల మాదిరి చ్చట
మన్నుతుండాలె
34 మారుతున్నై కాలరీతులు
జారుతున్నై సంఘనీతులు
మారిపోయిన దారి నడిచే
మనిషి ఉత్తముడోయ్.
35 ఎత్తు ఎత్తుమే డలున్నా
మెత్త మెత్తని పరుపులున్నా
చిత్తము నిలుప లేకుంటే
ఉత్తదే బ్రతుకు
36 లోకమంతా ఒక్క నీతే
దేశమంతా ఒక్క రీతే
మనుషులంతా ఒక్క జాతే
మరిచిపోకోయీ 37 మనుషులంతా మంచి వారై
దేశమంతా పంట భూమై
ప్రజలదే పరిపాలనంటే
స్వర్గ మెనోయీ
38 దేముడిచ్చే సంపదలకై
నీవు కక్కూర్తేల పడతావ్
అడవిలో కూర్చున్నా. అవి నీ
కడకు వస్తయ్యి
39 మానవత్వం మరువకండోయ్ !
జ్ఞ్యానసూత్రం విడువకండోయ్
అందరూ హాయిగా ఉండే
మందు వెతకండోయ్ .
40 మంచిమనసే మానవత్వం
పరులసేవే ప్రేమతత్వం
జ్ఞ్యాన కాంక్షే ఉన్నతత్వం
మరచి పోకోయీ!
41 ఒక్కటైనా మంచిపని ,నే
నక్కటా చేసాను కాను
కాలమంతా పొట్ట కొరకే
గడచి పోతోంది.
42 ఓయి మనిషీ! అందరూ యిట
హాయిగా బ్రతకాల, పరులకు
హానిచేసే తలపులన్నీ
మానివేయాలోయ్ !
43 మంచిపనులే మనిషి నిచ్చట
మరువకుండా మనని చేస్తై
ఇళ్ళు వాకిళ్ళన్ని సంపద
లిట్టె పోతయ్యి
44 విత్తమే ముఖ్యమనుకుంటే
చిత్తము నిలిచేది సున్న
ఉత్తముడవై లోకమందున
ఉన్నతీ సున్నా!
45 కాల చక్రం తిరుగుతున్నది
మూల సూత్రం మారుతున్నది
మార్పు ననుసరించు వాడే
నేర్పుగల మనిషోయ్ !
46 మారుతున్నై కాలరీతులు
జారుతున్నై సంఘ నీతులు
మారిపోయిన దారి నడచే
మనిషి ఉత్తముడోయ్
47 కలిమి హృదయం క్రుంగ జేయును
లేమి హృదయం లేవదీయును
కలిమి కలిగి లేమి నెరిగి
మెలగ వలెనోయీ
48 మనిషి మనిషి పందెమేసుకు
నడుస్తారీ సంఘమందున
సమానంగా చేయటానికి
సాధ్యమవుతుందా ?
49 ఎంత ఉన్నా చింత తప్పదు
లేకున్నా చింత తప్పదు
కలిమిలేములు కావు చింతకు
కోరికలు మూలం .
50 తరతరాలై వచ్చుచున్న
సాంప్రదాయం వదలకుంది
ముందు అడుగువేయటానికి
ఎందుకో భయము .
51 ధనం లోనే బలం ఉందా?
ధనం లోనే కులం ఉందా?
ధనం కోసం ప్రాణ మెందుకు
ధార పోస్తారు ?
52 ఎవ్వరైనా ఎక్కడున్నా
ఎదుర్కొని తీరాలనోయి
వొద్దు వొద్దని యుద్ధ మొద్దని
బుద్ధి చెప్పాలోయ్.
53 పనికిరాని భూములన్నీ
పంటచేలై పండుతున్నై
నీతి తప్పిన మనుషులందరు
ఖ్యాతిగంటున్నార్.
54 తిండి లోను ఏమి లేదు
ఉండే చోటులోను లేదు
తలపులోనే మర్మమంతా
దాగి ఉందోయీ.
55 కామరూపులుగాను స్త్రీలు
కంటి కగపడతారు నీకు
దేముడున్న కోవెలనుకొని
తలచలేవేమి?
56 వొద్దు బాబు అధిక సంపద
వొద్దు బాబు ఆయు వెక్కువ
మితం లేని మెత్త హృదయం
మాత్రమే చాలు
57 పొన్న పండు లాగ కొందరు
పైకి కనిపిస్తారు కాని
ఎన్నో విధముల లోలోపున
కుళ్ళు తుంటారు
58 పైకి దీనులట్లు ఉంటార్
పాపమంటూ అందరంటార్
తృప్తులై ఆనందమున మరి
కొందరుంటారు.
59 పెండ్లి లేక ఆడపిల్లలు
కుళ్ళుతున్నార్ మేడలోన
కట్న మివ్వలేక తండ్రి
గాబరా పడతాడ్.
60 చదువుకున్న ఆడపిల్లలు
జంకు విడిచి బయటికొస్తే
కట్న మడిగే పెళ్లి కొడుకులు
కాళ్ళుపడతారు .
61 చదువుకున్న ఆడపిల్లలు
చంగు చంగున ఎగురుతారోయ్
చాడువులోని సారమెరిగి
చప్పబదతారోయ్
62 పెళ్లి కోసం ఎందుకిల్లా
వొళ్ళు ఇల్లు గుల్ల లవడం
ముందుగానే దేముడంతా
చేసిపంపాడోయ్!
63 వెర్రి భాయి ల్లార మీరు
వేలు వేలు ఖర్చు పెడతార్
రిజిస్ట్రేషన్ పెళ్లి చేసుకు
సుఖం గనలేరేం ?
64 ముప్ఫై ఏళ్ల పెళ్లి కూతురు
నలభై ఏళ్ల పెళ్లి కొడుకు
పెళ్లి పీటల మీద కూర్చొని
మురిసిపోతున్నార్
65 బి. ఎ . చదివిన పెండ్లి కూతురు
ఎల్.ఎల్.బి. పెండ్లి కొడుకు
స్పెషల్ మేరేజి ఏక్ట్ వీళ్ళకు
జ్ఞాపకం రాదా ?
66 ప్రపంచం లో మనుషులంతా
ప్రేమ పంథా పట్టవలెనోయ్
విశ్వకవి టాగూరు పాడిన
పాటలినవోయీ
67 జ్ఞాన నేత్రం మూసుకున్నది
మానవత్వం మూతపడినది
ఎందుకోసం ఓ కవీ! నీ
వెదురు చూస్తున్నావ్ !
68 ఎవరు రమ్మన్నారో దీన్ని
ఎవరు పొమ్మన్నారొ దీన్ని
కష్టమెపుడూ మనిషి నొచ్చి
కదుపుతుంటుంది .
69 చేసేదేమీ లేదు మనకు
ఊసుపోని తలపు నీకు
మాసిపోని మచ్చ నాక ని
మనసులో వద్దు
70 ధనం ఉంటే ఘనం గా పని
తనం చూపెట్టు తూ ఉంటార్
ధనం లేని వాని బ్రతుకు ?
ద్వంసమేనా ?ఏం?
71 ధనం దాచి ఘనత గాంచుట
దొరలు నేర్పిన జ్ఞాన బోధ
నీతి నియమాల్ , సత్య , ధర్మాల్
మరచి పోయారోయ్
72 మంచి పనులే మనిషి నిచ్చట
మరువకుండా,మనని చేస్తై
ఇళ్ళు వాకిళ్ళన్ని సంపద
లిట్టె పోతయ్యి -
73 నీదు సుఖమే నీవు చూచుకు
ఇరుగు పొరుగుల నణగ ద్రొక్కకు
సంఘమంతా సుఖం గుంటే
చాల బాగుండు -
74 వినోభాజీ వచ్చి నాడోయ్
దాన ధర్మం చెయ్యమంటూ
అవసరం లేనట్టి సంపద
లందరి వ్వాలోయ్
ఏరి ఈ ముత్యాల సరములు
కోరి నీ కర్పించు చుంటిని
ప్రేమతో నీ వందుకో
నా పాటల రాణి !
.
Subscribe to:
Posts (Atom)


